సెయింట్ జోసఫ్ విద్యార్థులకు భరోసా: చల్లా అరుణ

20-11-2026 | 03:11pm

కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలోని రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ పాఠశాల(Rudrampur St. Joseph's School) నందు శుక్రవారం భరోసా సెంటర్ ద్వారా, అందించబడుతున్న సేవలు, పోక్సో చట్టం(POCSO Act), సోషల్ మీడియా/మొబైల్ ఫోన్ వినియోగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ప్రాముఖ్యత, ఫిలిప్ క్రిస్టల్ పద్ధతి, టి.సేఫ్ యాప్ గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు.

విద్యార్థులలో ఎటువంటి భయాందోళనకు గురి కావలసిన పనిలేదని, ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే 112 టోల్ ఫ్రీ నెంబర్ కు ,భరోసా టీంకు సమాచారం అందిస్తే తక్షణ చర్యగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని, ఈ సందర్భంగా భరోసా ఇన్చార్జి ఎస్సై చల్లా అరుణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భరోసా   కో ఆర్డినేటర్ సుమలత, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ సంధ్యారాణి, కాలేజీ యజమాన్యం  మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 420 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు