ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు యెర్నేని జన్మదిన వేడుకలు

20-11-2026 | 02:58pm

కోదాడ(విజయక్రాంతి): కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యెర్నేని వెంకట్ రత్నం బాబు జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యెర్నేని యువసేన సభ్యులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శకుంతల థియేటర్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి భారీ కేక్‌ను ఏర్పాటు చేసి సంబరాల మధ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... యెర్నేని బాబు గత ఐదు దశాబ్దాలుగా కోదాడ ప్రాంతంలో విశేష ప్రజాదరణ కలిగిన నాయకుడిగా కొనసాగుతున్నారని, సర్పంచ్‌గా, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కోదాడ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. పేదల పక్షపాతిగా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, సినిమా హాల్ బాబుగా ప్రజల మన్ననలు పొందిన ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం యెర్నేని వెంకట్ రత్నం బాబు మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తన సతీమణి, కోదాడ మున్సిపల్ చైర్మన్ యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబుతో కలిసి అభిమానుల కేరింతలు, చప్పట్ల మధ్య భారీ కేక్‌ను కట్ చేశారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్మన్ యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యెర్నేని యువసేన రావెళ్ల కృష్ణారావు, లైటింగ్ ప్రసాదు, మైలారం శెట్టి భాస్కర్, కొండలు వంటి పులి శ్రీను, సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు