వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
20-11-2026 | 02:54pm
భూత్పూర్: భూత్పూర్ మండల పరిధిలోని పెద్ద తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ సుశీల రెడ్యా నాయక్ అన్న వివాహానికి దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(MLA Madhusudan Reddy) హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. గ్రామ సర్పంచ్ సుశీల ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుశీల, రెడ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.