రాష్ట్రస్థాయి బిఈఈ పోటీల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
ఆసిఫాబాద్(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి బిఈఈ పెయింటింగ్ పోటీల్లో(state-level BEE painting competition) ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(Asifabad Social Welfare Gurukul School) విద్యార్థులు ప్రతిభ చాటారు. 6వ తరగతి డి. రణవీర్, 7వ తరగతి డి. సాయి కృష్ణ, జాడి సంతోష్ పోటీల్లో పాల్గొన్నారు. గ్రూప్-బి విభాగంలో జాడి సంతోష్ కాంసొలేషన్ ప్రైజ్ కింద రూ.7,500 అందుకున్నారు.
పోటీల్లో పాల్గొన్న ముగ్గురు విద్యార్థులకు రూ.2 వేల నగదుతో పాటు స్కూల్ బ్యాగులు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు అందజేశారు.విద్యార్థులను జోనల్ అధికారి శారదా, ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీం, వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రాజన్న, అభినందించారు. ఆర్ట్ టీచర్ దేవాజి కృషిని ప్రశంసించారు. చదువుతో పాటు కళారంగంలోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు.