మృతుడి కుటుంబానికి రేగా కాంతారావు పరామర్శ
16-09-2026 | 08:18pm
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని మోరంపల్లి బంజర్లో బీఆర్ఎస్(BRS) జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం పలు మృతుల కుటుంబాలను పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకుడు బత్తుల రామకొండారెడ్డి తండ్రి చిన్నపరెడ్డి, గ్రామానికి చెందిన పుట్టి రాంబాబు మృతి చెందిన విషయం తెలుసుకుని వారి ఇళ్లకు వెళ్లిన రేగా కాంతారావు(Rega kanta rao) చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం, సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మోరంపల్లి బంజర ఉపసర్పంచ్ పొక్కుల రవి,నాయకులు మేడగం లక్ష్మినారాయణరెడ్డి, గోపిరెడ్డి రమణారెడ్డి, కైపు ఖగేందర్రెడ్డి, యక్కంటి శ్రీనివాసరెడ్డి, గోనెల నాని,సోము లక్ష్మిచైతన్యరెడ్డి, కృష్ణ, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.