నలుగురికి రెండు రోజుల జైలు

16-09-2026 | 08:42pm

- రూ.10వేల చొప్పున జరిమానా 

సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురు లారీడ్రైవర్లు, ఒక ద్విచక్ర వాహనదారుడికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్షతోపాటు, రూ. 10వేల చొప్పున జరిమానా విధించింది. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ముత్యం రాజు(Traffic CI Muthyam Raju) తన సిబ్బందితో కలిసి మంగళవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ముగ్గురు లారీ డ్రైవర్లు మద్యం వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.

అదేవిధంగా  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మద్యం తాగి మోటార్ సైకిల్ నడుపుతూ మరొక వ్యక్తి పట్టుబడ్డాడు. బుధవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట పోలీసులు హాజరుపరిచారు. కేసులను విచారించిన న్యాయమూర్తి నిందితులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధించారని సీఐ ముత్యంరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు