మున్సిపల్ 7వ వార్డులో ఎస్ఐఆర్ పరిశీలించిన చైర్మన్ రాధాకృష్ణ..
16-09-2026 | 08:51pm
సుల్తానాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మున్సిపల్ లోని 7వ వార్డులో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ(Municipal Chairman Radhakrishna) పరిశీలించారు. ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు, చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు బుధవారం వార్డు కౌన్సిలర్ ఉట్ల వరప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు విధిగా కలిగి ఉండేలా చూడాలని బిఎల్ఓ లు అర్హులైన ఓటర్లకు సహకరించి ఓటు నమోదుకు కావాల్సిన పత్రాలను పరిశీలించి నమోదు చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈర్ల స్వరూప శేఖర్, గాదాసు మంజుల రవీందర్ జి పి ఓ మహేందర్ రెడ్డి , బి ఎల్ ఓ లు పాల్గొన్నారు....