తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వార్షికోత్సవం

16-09-2026 | 08:35pm

సిర్గాపూర్ సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని ఖాజాపూర్ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, నాటి పోరాట వారసత్వం స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంసిపిఐయు నాయకులు టి.కుమార్(MCPI(U) leader T. Kumar) అధ్యక్షన సమావేశమై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులై ఎంసిపిఐయూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.తుకారం నాయక్ హాజరై అమరవీరుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భూమి భుక్తి వెట్టి చాకిరి విముక్తి కోసం వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 అక్టోబర్ 21 వరకు కొనసాగిందని, ఆంధ్ర మాహసభలో కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు గ్రామీణ ప్రాంతాలల్లో రైతులు చేతి వృత్తులు వారు బడుగు బలహీన వర్గాలు కష్టజీవులు సామాన్య ప్రజలు నిరంకుశ నైజాం ప్రభుత్వ నిజం ప్రభుత్వ సైన్యంపై నెహ్రు పటేల్ సైన్యాలపై ఆయుధాలు చేతబట్టి హీరోచీత పోరాటాలు నిర్వహించారుని, పది లక్షల ఎకరాల భూస్వాముల భూములను గురించి పేదలకు పంచడం జరిగిందని 3000 గ్రామాలను గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పరచుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐయు నాయకుల, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు