రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక
అభినందించిన ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ఖొఖొ పోటీల(Khelo India Kho-Kho competitions)కు ఆల్ఫోర్స్ విద్యార్థులు(AllForce students) ఎంపిక అయ్యారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో విద్యార్థులకు నిష్ణాతులైన అధ్యాపకులచే నిత్య శిక్షణ ఇస్తున్నామని దీంతో విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు.
పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట గ్రామంలో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో జి. సాయి కీర్తన, పి. హర్షితలిద్దరూ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. బుధవారం నుండి హైదరాబాదులోని సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపీక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.