సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

16-09-2026 | 08:41pm

నూగూరు,(విజయక్రాంతి): వెంకటాపురం మండల(Venkatapuram Mandal) కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన 13 మంది లబ్ధిదారులకు రూ.4,92,000 విలువైన చెక్కులను భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు(MLA Tellam Venkat Rao ) బుధవారం అందజేస్తూ అనారోగ్యంతో వైద్య చికిత్స పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి(Chief Minister Relief Fund) ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజల ఆరోగ్య సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

చెక్కులు అందుకున్న వారిలో సోమ చంద్రశేఖర్ కు రూ.30,000, యెట్టి ప్రవీణ్ కు రూ.60,000, సముగొండ శ్రీవల్లికి రూ.10,500, చిట్టెం మహేశ్వరికి రూ.60,000, చిక్కోళ్ల నాగమణికి రూ.23,000, పోలిన శ్రీనివాసరావుకు రూ.40,000, మాతూరి దామోదర్ రావుకు రూ.19,000, కలివ జాగేశ్వరరావుకు రూ.14,500, యాలం నందినికి రూ.32,000, యాసం మోహన్ రావుకు రూ.23,000, ఆశం సత్యనారాయణకు రూ.60,000, కొండగౌని చక్రపాణికి రూ.60,000, కోరాం వెంకటేశ్ కు రూ.60,000 చొప్పున మొత్తం రూ.4,92,000 అందజేశారు. 

ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తాటి సరస్వతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, కాంగ్రెస్ జిల్లా నాయకులు చిడెం మోహన్ రావు, సీనియర్ నాయకులు బాలసాని వేణుగోపాల్, యువజన మండల అధ్యక్షులు చిట్టెం సాయి, వాసు, సాగర్, రవి, కార్యకర్తలు, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు