పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి

02-11-2026 | 08:35pm

నవంబర్‌ 6లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలి: రేగా కాంతారావు

బూర్గంపాడు,(విజయక్రాంతి): ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు(Voter Registration) ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ మాజీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Former MLA Rega Kantha Rao) సూచించారు. సోమవారం మొరంపల్లి బంజరలోని వెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన మండలస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో పట్టభద్రులను గుర్తించి అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి నవంబర్‌ 6లోగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. జిల్లాలోనే బూర్గంపహాడ్‌ మండలాన్ని ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎన్నికల ఇన్‌ఛార్జి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌, మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ బిక్కసాని శ్రీనివాసరావు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు