బాలిక అదృశ్యం

21-10-2026 | 11:26pm

అశ్వారావుపేట, అక్టోబర్ 21 (విజయక్రాంతి): అశ్వారావుపేట మండలం(Aswaraopeta Mandal) చెన్నాపురం గ్రామానికి చెందిన మడకం అనూహ్య అనే బాలిక ఈ నెల 12వ తేదీ నుండి కనపడటం లేదని, ఆమె తల్లి మడకం శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనూహ్య ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నదని ఈ నెల 12వ తేదీ ఉదయం స్పోర్ట్స్ మీట్ క్యాంపులో పాల్గొనేందుకు కొత్తగూడెం వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదని తెలిపారు. మడకం అనూహ్య తప్పిపోయిన సమయంలో నలుపు రంగు జీన్స్ ప్యాంట్, ఆరెంజ్ మరియు ఎరుపు రంగు టాప్ ధరించి ఉందని తెలిపారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు