అట్టహాసంగా ముగిసిన దేవీ నవరాత్రి ఉత్సవాలు

21-10-2026 | 10:31pm

బెల్లంపల్లి: మంచిర్యాల బెల్లంపల్లిలో దేవి నవరాత్రి ఉత్సవాలు(Devi Navaratri Celebrations) అత్యంత వైభవంగా ముగిశాయి. విజయదశమి పర్వదినాన్నీ పురస్కరించుకొని బెల్లంపల్లి దేవి నవరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం దేవి నవరాత్రి వేడుకలు అందరిని పులకరించాయి. ముగింపు వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఆలయం నుంచి చేపట్టిన శోభయాత్ర పట్టణ పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కాంటా చౌరస్తా వరకూ సాగిన ఉత్సవ విగ్రహ శోభయాత్ర నృత్య కోలాటాల మధ్య ముగిసింది.

మరిన్ని వార్తలు