దసరా పండుగ మంచినీ నేర్పుతుంది..

21-10-2026 | 10:28pm

- మంత్రి గడ్డం వివేక్

- నేత్ర పర్వంగా వేడుకలు

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దసరా పండుగ వేడుకలు మిన్నంటాయి. స్థానిక తిలక్ గ్రౌండ్ లో దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కార్మిక మంత్రి గడ్డం వివేక్(Minister Gaddam Vivek), బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. ప్రజలు దసరా పండుగను ఆనందంగా జరుపుకుంటారని తెలిపారు. కొత్తబట్టలు ధరించి ఎంతో ఆనందంగా జరుపుకుంటారన్నారు. దసరా పండుగ ఎంతో విశిష్ట మైనదని పేర్కొన్నారు. దసరా పండుగ ప్రజల ఐక్యతను చేరుతుందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ఆయన వివరించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి అరెక్కడా జరుగలేదని వెల్లడించారు. రూ. 23 వేలకోట్ల రుణ మాఫీ చేశామన్నారు. పిల్లలకు పౌష్టి కాహారం అందించడమకోసం అల్పాహార పథకం అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. జర్మనీ లాంగ్వేజి నేర్పించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమకోసం మందమర్రిలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. జర్మనీ లాంగ్వేజి శిక్షణా కేంద్రం బెల్లంపల్లి లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు