బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలు హత్య

21-10-2026 | 10:46pm

వృద్ధురాలి హత్యతో ఉలిక్కిపడ్డ హుజూర్ నగర్ పట్టణం

హుజూర్‌న‌గ‌ర్, అక్టోబర్ 21: వృద్ధురాలు హత్యకు గురైన ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) హుజూర్‌న‌గ‌ర్ పట్టణంలోని సుందరయ్య నగర్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని 6వ వార్డు పరిధిలో గల సుందరయ్య నగర్ కాలనీకి చెందిన మామిడి రాములమ్మ(74) అనే వృద్ధురాలు మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైనట్లు ఎస్ఐ చలికంటి నరేశ్‌ తెలిపారు. మామిడి రాములమ్మ మెడలో ఉన్న బంగారు ఆభరణాల కోసం హత్య చేసినట్లు అనుమానిస్తున్నామని ఈ విషయంపై కాలనీవాసుల నుండి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. క్లూస్ టీంతో ఆధారాలు సేక‌రించిన‌ట్లు హత్య ఘటనపై రాముల‌మ్మ‌ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు.

మరిన్ని వార్తలు