బెజ్జూర్ మండల కేంద్రములో మైత్రి నగర్ కాలనీ నామకరణ
బెజ్జూర్ (విజయక్రాంతి): దసరా పండుగను పురస్కరించుకుని బెజ్జూర్‌లోని మైత్రినగర్ కాలనీ(Mythri Nagar Colony) పేరు నామకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ నేమ్ బోర్డును పూలమాలలతో అలంకరించి, పూజలు నిర్వహించి నామకరణం చేశారు. మైత్రి నగర్ కాలనీ అభివృద్ధి చెందాలని, కాలనీ వాసులందరూ ఐకమత్యంతో ఉంటూ అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి, చిప్పకుర్తి కాంతయ్య, అమీర్, తెలంగాణ జావిద్, జాకీర్ జంగిటి మల్లేష్, దేవాజీ శోభన్ పురుషోత్తం రాజేష్ కళ్యాణ్, సాయి, అడూరి మహేష్, చెప్పకుర్తి వెంకటి, అర్పెపల్లి లింగయ్య మల్లయ్య నక్క రాజయ్య సుధాకర్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.