ఉత్సాహంగా గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలు..

21-10-2026 | 10:37pm

-విజేతలకు బహుమతులు అందజేసిన

-సర్పంచ్ భూక్య బిక్కు నాయక్

మోతె, అక్టోబర్21 (విజయక్రాంతి): మండల పరిధిలోని గోప తండా గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకుని నిర్వహించిన గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలు(Kabaddi Tournament) ఉత్సాహభరిత వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన గోపతండ జట్టుకు  సర్పంచ్ భూక్యా బిక్కు నాయక్  బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి, ఐకమత్యం, క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు.

యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలు గ్రామీణ యువతలో నూతన ఉత్సాహాన్ని నింపాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు:- భూక్య బిక్కు సర్పంచ్, పవన్ కుమార్ జ్ఞాపకార్థం భూక్యనాగు, భూక్య అశోక్, గుగులోతు భగవాన్, జరుపల రంగా, స్థలం దాత గుగులోతు వినోద్, భూక్య నరేష్, టెంటు, భూక్య నాగు  (జెసిబి) ఉప సర్పంచ్ మాలోతు ఈశ్వరి రవి, డీలర్ సీతారాములు, గుడి చైర్మన్ రామోజీ, కోర్ర శరత్ నాయక్, బి. నవీన్  కోర్ర శివ, గ్రామ నాయకులు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు