బీజేపీ అధిష్ఠానం టార్గెట్ తెలంగాణే

10-09-2026 | 05:30am

యూపీ ఎన్నికల తరువాత

  1. మా గెలుపును ఎవ్వరూ ఆపలేరు
  2. కేంద్ర మంత్రి బండి సంజయ్

భద్రాచలం, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) గెలుపు ను ఎవ్వరూ ఆపలేరని, యూపీ ఎన్నికల(UP elections) అనంతరం బీజేపీ అధిష్ఠానం టార్గెట్ తెలంగాణ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా(Khammam District) కు చెందిన ఓ మంత్రి ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇచ్చే ఇళ్లు, సన్న బియ్యాన్ని కాంగ్రెస్ గొప్ప గా చెప్పుకుంటోందని విమర్శించారు. కేసీఆర్ మెడలు వంచింది బీజేపీయే అని చెప్పారు.

నాటి రజాకార్ల పాలన కంటే ఘోరమైన కేసీఆర్(KCR) పాలనలో బీజేపీ కార్యకర్తలు కొట్లాడారని గుర్తుచేశారు. కేసీఆర్(KCR) పాలనలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి బీజేపీ కార్యకర్త పై అక్రమ కేసులు పెట్టి వేధించారని మండిపడ్డా రు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశాన్ని ఏలిన కాంగ్రెస్(Congress) నాలుగు రాష్ట్రాలకే పరిమితమైందని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని.. కార్యకర్తలు పోలీసు కేసులకు భయపడొద్దని అన్నారు.

‘నాపై 109 కేసులున్నా వెనుకడుగు వేసేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఇక యుద్ధం చేయాలి. గడప గడపకు బీజేపీ కార్యకర్తలు వెళ్లాలి’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) భద్రాచలంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో రామరాజ్యం రావాలని, మోదీ రాజ్యం రావాలన్నారు. రాబోయే అసెంబ్లీ ఎ న్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాలను బీజేపీ గెలిచి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

తెలంగాణలో బీజే పీ గెలుపును ఎవ్వరూ ఆపలేరని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత బీజేపీ అధిష్ఠానం టార్గెట్ తెలంగాణ అని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అప్పుడు కేవలం ఒక కుటుం బం మాత్రమే దోచుకుంటే, ఇప్పుడు మంత్రు లు, ఎమ్మెల్యేలు అందరూ దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మాత్రమే మా రిందని, దోచుకోవడం మాత్రం కామన్ అని ఎద్దేవా చేశారు.

కష్టపడి కట్టుకున్న పేదల కష్టార్జితమైన సుమారు కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి దోచుకోవడానికి కా ంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నదని, దీనికి సూత్రధారి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి అని ఆరోపించారు. ఖ మ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు వ సూలు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారని, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలోనే అత్యంత వ్యతిరేకత కలిగిన ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వారేనని ఆరోపించారు.

ఈ ముగ్గురు మంత్రులు సీఎంకు ఒకరు లెఫ్ట్, మరొకరు రైట్, ఇంకొకరు ఎప్పుడు సీఎం కుర్చీ లాక్కుందామని ఎదురుచూస్తున్నారంటూ విమర్శిం చారు. ‘ఢిల్లీకి మూటలు మోసుకు పోవడమే వీరి పని అని ఆరోపించారు. ఈ ముగ్గురు మ ంత్రుల వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎలాం టి న్యాయం జరగలేదన్నారు.

కేంద్ర ప్రభు త్వం మంజూరు చేసిన నిధులతోనే వీరు పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ని ధులు కేంద్రమిస్తే ఆ పథకాలకు వీరి పేర్లు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని మ ండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ కేవలం నాలు గు రాష్ట్రాలకే పరిమితమైందని, వచ్చే ఎన్నికల్లో ఆ నాలుగు కూడా బీజేపీ గెలుచుకుం టుందని జోస్యం చెప్పారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు మధ్య తేడా లేదు..

ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు తేడా ఏమీ లేదని బండి సంజయ్ విమర్శించారు. అప్పుడు నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతుల ఆత్మహత్య చేసుకున్నారు.. ఇప్పుడూ చేసుకుంటూన్నారని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా డబుల్ ఇంజన్ సర్కారు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. బీజేపీకి ఓట్లు వేయడానికి ప్రజలు అంతా సిద్ధంగా ఉన్నారని, మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్యాడర్ బలంగా ఉన్నది కానీ కొంచెం నాయకత్వలోపం ఉన్నది. 

ఎన్నికలలో గెలుపోట ములు సహజం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలు బిజెపి గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో నాలుగు నేషనల్ హైవేలు నిర్మించామని, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న భద్రాచలం రైల్వే లైన్‌ను ప్రస్తుతం కేంద్ర మంజూరు చేసిందని చెప్పారు. పాండురంగాపురం నుంచి మల్కానగిరి వరకు రైల్వే లైన్ మంజూరు చేసి నిధులను కూడా కేటాయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు