ఇథనాల్ వాడకంతో అనేక ప్రయోజనాలు

10-09-2026 | 05:05am

మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్

ఇథనాల్ వినియోగంతో రైతుల పంటలకు మంచి ధర, కాలుష్యం తగ్గింపు, విదేశీ మారక ద్రవ్య ఆదా వంటి ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ ‘ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం’పై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల వాహనాలు పాడవుతున్నట్లు ఇప్పటివరకు వాహన యజమానులు, ఆటోమొబైల్ రంగ నిపుణుల నుంచి రవాణాశాఖకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఇంధన విధానం ప్రకారం ఏప్రిల్ 16 నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయిస్తున్నట్లు చెప్పారు.

దీనివల్ల వాహనాల పికప్, మైలేజీ కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణ సర్వీసింగ్ పెద్దగా ఇబ్బందులు ఉండవన్నారు. రాష్ట్రంలో ఈవీ పాలసీని విజయవంతంగా అమలు  చేస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలకు 100 శాతం పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 

మరిన్ని వార్తలు