గవర్నర్‌కు ఆధారాలన్నీ చూపాం
- మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి ఆధారాలను సమర్పించాం
- మా హక్కులను కాలరాసిన తీరును వివరించాం
- అన్ని అంశాలపైనా విచారణకు గవర్నర్ హామీ
- కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారింది
- అవసరమైతే జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తాం
- స్పీకర్‌పై మాకు అపారమైన గౌరవం ఉంది
- ‘దళిత స్పీకర్’ అంటూ కాంగ్రెస్ పార్టీనే అవమానిస్తోందని ఆరోపణ
- లోక్‌భవన్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : మహిళా ఎమ్మెల్యేల(women MLAs)పై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు, ఇతర ఆధారాలన్నింటినీ గవర్నర్ శివప్రతాప్ శుక్లా(Governor Shivpratap Shukla)కు సమర్పించామని, తమ హక్కులను కాలరాస్తూ బీఆర్ఎస్ శాసనసభ్యులను అసెంబ్లీలోకి రానివ్వకుండా రోడ్డు పైనే అడ్డుకున్న తీరును వివరించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలిపారు. అన్ని అంశాలపై విచారణ జరిపిస్తామని గవర్న ర్ మామీ ఇచ్చారని చెప్పారు.
బుధవారం బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ అనంతరం కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao), ఇతర సభ్యులు నేరుగా లోక్‌భవన్(Lok Bhavan)కు చేరుకుని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాలనా వైఫ ల్యం, బీఆర్ఎస్ సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, తాజా పరిణామాలపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం లోక్‌భవన్ వె లుపల కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ(Rahul Gandhi) పార్లమెంటు(Parliament)లో నిరసన తెలిపిన తరహాలోనే టీ-షర్ట్ల(T-shirts) ద్వారా నిరసన తెలపాలని భావించా మని, అయితే తమను సభలోకి రా నివ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా మా నాయకురాలు సునితా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy) చీరను లాగి దుశ్శాసన పర్వానికి తెరలేపిన తీరును గవర్నర్‌కు వివరించామని చె ప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పా లనా దారుణంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీ ల అమలులో విఫలమైందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత తో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
శాసనసభ సమావేశాల మొదటి రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలపై దాష్టీకాన్ని పాల్పడ్డారని, తిరిగి మ మ్మల్నే బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పోలీసులపై ప్రభుత్వానికి ఫిర్యా దు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. చివరికి కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా కేసీఆర్ ఇంటిపై దాడి చే సేందుకు వెళ్లడం దారుణమని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, కోర్టులపై గౌర వం లేదని, అకారణంగా తమను సభనుంచి సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. తమకు స్పీకర్‌పై అపారమైన గౌరవం ఉందని, కాంగ్రెస్ పా ర్టీనే దళిత స్పీకర్ అంటూ అవమానిస్తుందని ఆరోపించారు. కేసీఆర్ లాంటి మహానాయకు డి ఇంటి వద్ద చావు డప్పు కొడుతూ, ఆయన చావును కోరడం దుర్మార్గమని.. ఈ వ్యవహా రం వెనుక సీఎం స్వయంగా ఉన్నారని ఆరోపించారు.
వెయ్యి రోజుల పాలనా వైఫలం, హామీ ల అమలులో విఫలం, శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన అంశాలతో పాటు, బయ ట జరిగిన ప్రతి సంఘటనపైన విచారణ జరిపిస్తామని గవర్నర్ హామీ ఇచ్చినట్టు కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న దౌర్జన్యకాండ లో గవర్నర్ జోక్యం చేసుకుంటారని ఆకాంక్షించారు. న్యాయం జరగకుంటే జాతీయ మహి ళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్ : మాజీ మంత్రి హరీశ్ రావు
అసెంబ్లీలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ సభ్యులను కాదని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మూడు రో జులుగా అసెంబ్లీ సమావేశాలను తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, ప్రజలు ఎదుర్కొంటు న్న ఒక్క సమస్యపైనైనా చర్చ జరిగిందా? ఒక్క ప్రభుత్వ విధానంపైనైనా సమాధానం చెప్పా రా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని వేధించడం, గొంతు నొక్కడం, బయటకు పంపించడం తప్ప.. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై బుధవారం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. అసెంబ్లీలో ప్రజా సమ స్యలు చర్చకు రాకుండా బీఆర్ఎస్ సభ్యులను బలవంతంగా బయటకు పంపించడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభు త్వంలో విలీనంపై ఆర్టీసీ ఉద్యోగులు, నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తు న్న జీవో 97ను రద్దు చేయాలన్నారు. మైకులు కట్ చేసో.. సస్పెన్షన్ విధించో అసెంబ్లీలో మా గొంతును అణిచి వేయవచ్చు కానీ, ప్రజాక్షేత్రంలో చేయలేరని హెచ్చరించారు.