ప్రత్యామ్నాయ కార్యాచరణతో ముందుకెళ్తున్నాం

10-09-2026 | 05:10am

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 361 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Revenue Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ఐఎండీ సూచనలు, శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ సంస్థల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు.

ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి లేవనెత్తిన అంశపై మంత్రి పొంగులేటి సమాధానం ఇచ్చారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవడంతో గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటికి ఏమాత్రం ఇబ్బంది లేదన్నారు. ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను సిద్దం చేశామన్నారు. గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను చైతన్యపర్చామన్నారు. 

మరిన్ని వార్తలు