అక్టోబర్ 27న కిన్నెరసానిలో ఖేలో ఇండియా వాలీబాల్ ఎంపికలు
పాల్వంచ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఖేలో ఇండియా కార్యక్రమంలో(Telangana State Khelo India Programme) భాగంగా హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు(State-level volleyball competition) ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల(Khammam, Bhadradri Kothagudem District) బాలబాలికల ఎంపికలు ఈ నెల 27న నిర్వహించనున్నట్లు ఎంపికల ఇన్చార్జి, జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడు జి. సుధాకర్ తెలిపారు.
ప్రభుత్వ గిరిజన మోడల్ క్రీడా పాఠశాల, కిన్నెరసాని క్రీడా ప్రాంగణంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులని తెలిపారు.
క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమో, PEN (పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్)తో కూడిన పాఠశాల స్టడీ సర్టిఫికెట్ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు. అర్హులైన క్రీడాకారులు సకాలంలో హాజరై ఎంపికల ఇన్చార్జులు ఎస్. బాలసుబ్రహ్మణ్యం (పీడీ), కొమరం వెంకటనారాయణ (ఏఎస్ఓ)లకు నివేదించాలని కోరారు.