ఆండ్రాయిడ్‌ యాప్‌తో రైతులే ఫార్మర్‌ ఐడీ నమోదు చేసుకోవచ్చు

25-10-2026 | 07:47pm

గణపురం, అక్టోబర్ 25 (విజయక్రాంతి): గణపురం మండలంలోని(Ganapuram Mandal) రైతులు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా స్వయంగా ఫార్మర్‌ ఐడీ నమోదు చేసుకోవచ్చని వ్యవసాయ విస్తరణ అధికారి పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. గణపురం, తూపురం, కొండాపూర్‌, బుద్ధారం, బుర్రకాయలగూడెం తదితర గ్రామాల్లో ఇంకా నమోదు చేసుకోని అర్హులైన రైతులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియలో సందేహాలు లేదా ఇబ్బందులు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు