నెక్కొండలో 12 కేజీల గంజాయి పట్టివేత

25-10-2026 | 07:49pm

వరంగల్ (విజయక్రాంతి): నెక్కొండ ఎస్సై శ్రావణ్ కుమార్(Nekkonda SI Shravan Kumar) తన సిబ్బందితో నెక్కొండలో పెట్రోలింగ్ చేస్తుండగా బస్టాండ్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండి పోలీసులను చూసి పారిపోవుటకు ప్రయత్నించుగా సిబ్బంది అతని పట్టుకొని విచారించగా తన వద్ద 12 కిలోల ఎండు గంజాయి(Ganja) స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగిందని, మహారాష్ట్రకు చెందిన నితిన్ న్యాను షిండే ఇతడు మహారాష్ట్రకు(Maharashtra) చెందిన పోలీస్ కానిస్టేబుల్ అని గుర్తించినట్టు చెప్పారు.

నితిన్ ఒడిశా రాష్ట్రం(Nithin, Odisha state) నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ రేటుకు అమ్మెందుకు వెళుతుండగా ఆదివారం నెక్కొండలో పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో అతని వద్ద స్వాధీనపరుచుకున్న ఎండు గంజాయి విలువ ఆరు లక్షల రూపాయలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి ఇంకా ఈ కేసులు ఎవరైనా పాత్ర ఉందా అనేది దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు