నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధారాలు ఇవ్వాలి
12-09-2026 | 06:46pm
బూర్గంపాడు,(విజయక్రాంతి): ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(Voter List Revision Process)లో నోటీసులు అందుకున్న ఓటర్లు(Voters) తమ వద్ద ఉన్న ఆధారాలను పంచాయతీ కార్యాలయంలో అధికారులకు అందించాలని తహసీల్దార్ కేఆర్కే ప్రసాద్ సూచించారు. శనివారం సర్పంచ్ గుగులోత్ కిశోర్‌నాయక్ అధ్యక్షతన బీఎల్‌వోలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. జాబితాలో పేర్లు ఉండి అక్షర దోషాలున్న వారికి నోటీసులు ఇచ్చామని, వాటికి సంబంధించిన పత్రాలు సమర్పించి ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి గుగులోత్ రవికుమార్, వీఆర్వోలు ప్రసాద్, సీతమ్మ, బీఎల్‌వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.