మోదీ 25 ఏళ్ల సేవకు సేవా సంకల్ప్

12-09-2026 | 05:15am

17 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు  

‘ఆశీర్వాద్ కా దియా’తో శ్రీకారం 

లబ్ధిదారులు ఇండ్లలో దీపాలు 

స్వచ్ఛ భారత్, ‘మేరే సప్నో కా భారత్’, రక్తదాన శిబిరాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వెల్లడి 

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా దేశానికి అందించిన విశిష్ట సేవలను పురస్కరించుకుని జాతీయ స్థాయిలో నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు(BJP State President N. Ramchander Rao) వెల్లడించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేముల అశోక్, వీరేందర్‌గౌడ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధ వి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శి ల్పారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ప ల్నాటి వెంకట్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ము ఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 12.5 ఏళ్లు సీఎంగా, 12.5 ఏళ్లు ప్రధానమంత్రిగా మొత్తం 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకుంటారని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది  అరుదైన మైలురాయి అని కొనియాడారు. బీజేపీ జాతీయ నా యకత్వ ఆదేశాల మేరకు ఈనెల 17న మోదీ జన్మదినం నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉన్నందున, ఆ రోజు సాయంత్రం హైదరాబాద్‌లో ‘ఆశీర్వాద్ కా దియా’తో సేవా సంకల్ప్ అభి యాన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు రాంచందర్‌రావు వెల్లడించారు.

నెల రోజుల పాటు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛభారత్, వ్యాసరచన పోటీలు, ‘మేరే సప్నో కా భార త్’, ‘సేవా జ్యోతి కలశ్ యాత్ర’, ‘సుశాసన్ సే వా సంవాద్’ వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 25 న పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయం తి, అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కూడా అభియాన్‌లో భాగంగా ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మోదీ పాలన పట్ల కృతజ్ఞతగా ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కేంద్ర పథకాల లబ్ధిదారులు తమ ఇండ్లలో దీపాలు వెలిగించి ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.  

దేశ ఆర్థిక, సామాజిక ముఖచిత్రం మారింది

మోదీ దార్శనికతతో దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక ముఖచిత్రం మారాయని రాం చందర్‌రావు  వివరించారు. జన్‌ధన్ యోజ న ద్వారా 80 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు అందించి, డీబీటీ విధానంతో అవినీతి,దళారీ వ్యవస్థను రూపుమాపారని గుర్తు చేశారు. ఒకప్పుడు విమర్శలు చేసిన వారు ఆశ్చర్యపోయేలా నేడు ప్రపంచ యూపీఐ లావాదేవీల్లో భారత్ 41శాతం వాటా సాధించిందని తెలిపారు. దేశ జీడీపీ 7.8 శాతానికి చేరిందని, గతంలో 9.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని 2.5 శాతానికి కట్టడి చేశారని పేర్కొన్నారు. విశ్వకర్మ యోజన ద్వారా చేతివృత్తుల వారికి లక్ష రూపాయల సాయం, పీఎం స్వనిధి ద్వారా దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోని సుమారు౨ లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని అన్నారు.

మరిన్ని వార్తలు