ఓటర్ల జాబితా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

12-09-2026 | 07:20pm

* పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్

పాపన్నపేట: ఓటర్ల జాబితా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని మెదక్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నగేష్ అధికారులకు సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపియన్ డే  కార్యక్రమంలో భాగంగా శనివారం పాపన్నపేట మండలంలోని లక్ష్మీనగర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందిస్తున్న సేవలు, ఓటర్ల జాబితా పరిశీలన, ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహణ తీరును పరిశీలించారు.

పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న అభ్యంతరాలు, దరఖాస్తులు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో మ్యాపింగ్ కాని కేసులు (No Mapping Cases) ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించి, సంబంధిత రికార్డులను అధికారులు, సిబ్బందితో కలిసి ధృవీకరించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట తహసిల్దార్ సతీష్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు