పీఆర్టీయూ టీఎస్ కోహెడ మండల శాఖ కార్యవర్గం నియామకం
12-09-2026 | 07:46pm
కోహెడ,(విజయక్రాంతి): పీఆర్టీయు టీఎస్ కోహెడ మండల శాఖ(PRTU TS Koheda Mandal Branch Executive Committee) నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వింజపల్లి గ్రామానికి చెందిన అన్నాడి మహేందర్ రెడ్డి ఎన్నికయారు. ప్రధాన కార్యదర్శి కాశబోయిన ఓదెలు, అసోసియేట్ అధ్యక్షులుగా కరివేద లింగారెడ్డి, మహిళా అసోసియేట్ అధ్యక్షులుగా పన్యాల లక్ష్మి, ఉపాధ్యక్షులు చింతలపల్లి రాజిరెడ్డి, మహిళా ఉపాధ్యక్షులు సుంకేటి విజయలక్ష్మి, కార్యదర్శులు బాలసాని దామోదర్, బానోత్ మోహన్, మహిళా కార్యదర్శులుగా హేమలత, భాగ్యలక్ష్మి లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.