అట్టహాసంగా ప్రారంభమైన జోనల్ స్థాయి క్రీడా పోటీలు

19-09-2026 | 12:33pm

పినపాక, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్(Bayyaram Zilla Parishad) ఉన్నత పాఠశాలలో 70వ పినపాక జోనల్ స్థాయి క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పినపాక, కరకగూడెం మండలాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నట్లు పినపాక ఎంఈఓ వీరాస్వామి తెలిపారు.

జోనల్ స్థాయి క్రీడా పోటీల సందర్భంగా విద్యార్థుల మార్చ్‌పాస్ట్, క్రీడా జ్యోతి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం వివిధ క్రీడాంశాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో కబడ్డీ, కోకో వాలీబాల్, రన్నింగ్ తో పాటు అన్నీ రకాల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తునట్లు పీడి వీరన్న తెలిపారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జట్టు భావనను అభివృద్ధి చేయడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని వారు తెలిపారు. 

ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేసే అవకాశం ఉంటుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వాగబోయిన చందర్ రావు, ఉప సర్పంచ్ గంగిరెడ్డి సందీప్ రెడ్డి,పినపాక హెచ్ ఎం రామిరెడ్డి, పిడీలు వీరన్న, అనిల్, వరలక్ష్మి, రాములమ్మ, బాలరాజు, మహేష్, విజయలక్ష్మి, విజయ, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు