గ్రంథాలయాల సమస్యల పరిష్కారానికి కృషి

19-09-2026 | 12:41pm

 గ్రంథాలయ ఛైర్మన్ అనిల్ కుమార్

గ్రాంథాలయాల భవనాన్ని పరిశీలిస్తున్న ఛైర్మన్

వాంకిడి, (విజయక్రాంతి): గ్రంథాలయాల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్(Library Chairman) అనిల్ కుమార్ అన్నారు. శనివారం వాంకిడి మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠకులతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమ‌స్యలు. సౌకర్యాల కల్పన పై ఆరాతీశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉన్న గ్రంథాలయ

భవనం వర్షానికి ఉరుస్తోందని, మరుగుదొడ్లు. అవసరమైన స్టడీ మెటీరియల్(Study Material) సైతం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆయన దృష్టికి పాఠకులు తీసుకువెళ్లారు. గ్రంథాలయానికి పక్క భవనంతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో తెవాలనీ కోరారు.. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి.. అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్, నాగ భూషణం తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు