గోద్రెజ్ ఆగ్రోవెట్ కొత్త చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్‌గా అనుశ్రీ సింగ్
సెప్టెంబర్, 2026: భారతదేశ అగ్రగామి ఫామ్-టు-ప్రొటీన్ సంస్థలలో ఒకటైన గోద్రెజ్ ఆగ్రోవెట్(Godrej Agrovet) లిమిటెడ్, తమ సంస్థ నూతన చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్‌గా అనుశ్రీ సింగ్(Anushree Singh) బాధ్యతలు చేపట్టినట్లు ఇవాళ ప్రకటించింది. ఈ హోదాలో అనుశ్రీ సంస్థ ఉద్యోగుల వ్యూహరచనలో నాయకత్వం వహిస్తారు.
గోద్రెజ్ ఆగ్రోవెట్ దీర్ఘకాలిక వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రతిభను పెంపొందించడానికి మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా అత్యుత్తమ పనితీరు కనబరిచే సంస్థను నిర్మించడానికి ఆమె నాయకత్వ బృందంతో కలిసి పనిచేస్తారు.
గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ మరియు సీఈవో సునీల్ కటారియా ఆమెను నాయకత్వ బృందానికి స్వాగతిస్తూ మాట్లాడారు. "రైతులను శక్తిమంతం చేసి, దేశానికి పోషకాలను అందించే ఆవిష్కరణల ద్వారా సమృద్ధిని సృష్టించాలనే లక్ష్యంతో గోద్రెజ్ ఆగ్రోవెట్ ముందుకు సాగుతున్న తరుణంలో, మా ఉద్యోగులను మరియు నాయకత్వ సామర్థ్యాలను బలోపేతం చేయడం మా వ్యూహాత్మక ప్రాధాన్యతగా ఉంది. ఉద్యోగుల పరివర్తనను నడిపించడంలో, సంస్కృతిని నిర్మించడంలో మరియు సంస్థాగత నైపుణ్యాన్ని సాధించడంలో అనుశ్రీకి ఉన్న లోతైన అనుభవం మాకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
అనుశ్రీ సింగ్ వివిధ రంగాలలో మరియు ప్రాంతాలలో హెచ్‌ఆర్ వ్యూహం, సంస్థాగత పరివర్తన, కల్చర్ నిర్మాణం, విలీనాలు మరియు స్వాధీనాలు (M&A), బోర్డు నిర్వహణ మరియు లీడర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో రెండు దశాబ్దాలకు పైగా అపారమైన అనుభవం ఉన్న సీనియర్ హెచ్‌ఆర్ లీడర్. ఆమె తన కెరీర్‌లో, వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగుల పనితీరును మలచడం, భారీ స్థాయి మార్పులకు నాయకత్వం వహించడం, డైవర్సిటీ అండ్ ఇన్‌క్లూజన్‌ను ప్రోత్సహించడం మరియు అత్యుత్తమ ఫలితాలు సాధించే సంస్థలను తీర్చిదిద్దడంలో బలమైన నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్‌లో, కంపెనీ తదుపరి వృద్ధి దశకు తగినట్లుగా ఉద్యోగుల సామర్థ్యాలను మరియు సంస్థాగత వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంపై ఆమె దృష్టి సారిస్తారు.
ఈ నియామకంపై గోద్రెజ్ ఆగ్రోవెట్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, అనుశ్రీ సింగ్ మాట్లాడుతూ.. గోద్రెజ్ ఆగ్రోవెట్ ప్రయాణంలో ఇంత కీలకమైన తరుణంలో తాను బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కంపెనీకి గొప్ప చరిత్ర, స్పష్టమైన లక్ష్యం మరియు ఉద్యోగుల విజయాన్నే ప్రాధాన్యతగా భావించే సంస్కృతి ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా సంస్థను సిద్ధం చేయడానికి, ఉద్యోగుల సంక్షేమం మరియు వృద్ధి కోసం పాటుపడే నాయకత్వ బృందంతో కలిసి పనిచేయడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పారు.