ప్రయాణికులకు తప్పని నిరీక్షణ

02-11-2026 | 12:01pm

ఫ్లైట్ ఎక్కే ముందు ఇది చెక్ చేసుకోండి.. ఇండిగో కీలక ప్రకటన

విశాఖపట్నం: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘మురసు’ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి 3వ తేదీ తెల్లవారుజాము మధ్య నెల్లూరు–నర్సాపురం మధ్య, ప్రధానంగా ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన సర్వీసులపై ప్రభావం చూపుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా Flight Operationsలో అంతరాయాలు ఏర్పడటంతో ప్రముఖ విమానయాన సంస్థ IndiGo ప్రయాణికులకు Travel Advisory జారీ చేసింది. విమానాశ్రయంలోనే కాకుండా విమానాల్లో కూడా ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావచ్చని హెచ్చరించింది. విశాఖలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాల రాకపోకల నిర్వహణపై ప్రభావం పడిందని ఇండిగో తన ప్రకటనలో వెల్లడించింది. ఈ కారణంగా ప్రయాణికులు విమానాశ్రయంలో ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావచ్చని, Boarding పూర్తయిన తర్వాత కూడా విమానంలోనే నిరీక్షించే పరిస్థితి ఉండవచ్చని తెలిపింది. ఆలస్యాల వల్ల కలిగే అసౌకర్యంపై ప్రయాణికులకు క్షమాపణలు చెబుతూ, సహకరించాలని కోరింది.

ఫ్లైట్ స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి

ప్రయాణానికి బయలుదేరే ముందు తమ విమానానికి సంబంధించిన తాజా వివరాలను అధికారిక Websiteలో పరిశీలించాలని IndiGo సూచించింది. Flight Status, Departure Time, Delay Updates వంటి వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు తెలిపింది. చివరి నిమిషంలో ప్రయాణ ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ అంతరాయాల నేపథ్యంలో ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించేందుకు తమ Crew Members, Ground Staff పనిచేస్తున్నారని ఇండిగో వెల్లడించింది. వేచి ఉండే సమయంలో ప్రయాణికులకు సాధ్యమైనంత సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. విశాఖకు వెళ్లే లేదా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ Flight Updates తప్పనిసరిగా పరిశీలించడం మంచిది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు విమానాల షెడ్యూల్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు