రేవంత్ రాజీనామా చేయాలి

25-09-2026 | 11:42am

బిఆరెస్ నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): రైతు కోసం పెరుగుతున్న విద్యుత్ సంక్షోభం(Electricity Crisis), తగ్గిన విద్యుత్ ఉత్పత్తి వల్ల రైతులకు సక్రమంగా కరెంటు ఇవ్వడంలేదని, సరిపోయేంత విద్యుత్ ఇవ్వడం చేతకాక పొతే దిగి పోవాలని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం  అని, ఒక్క రోజు కూడా కొనసాగే అర్హత లేదని బిఆరెస్ నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Former Minister Jagadish Reddy) సూచన మేరకు హుజుర్నగర్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో హుజుర్నగర్ నియోజకవర్గం నుండి బిఆరెస్ నాయకులు, శ్రేణులు చలో దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ నిరసన కార్యక్రమంనకు భారీగా తరలివెళ్లారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జగన్ నాయక్, పిఏసిఎస్ మాజీ చైర్మన్ వీరం రెడ్డి శంబి రెడ్డి, నియోజకవర్గ బిఆరెస్ పార్టీ సీనియర్ ఉద్యమ నాయకులు న్యాయవాది నగేష్ రాథోడ్, గరిడేపల్లి మాజీ మండలాధ్యక్షుడు కృష్ణ నాయక్, సీనియర్ ఉద్యమ నాయకులు కొణతం లచ్చి రెడ్డి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడియా శ్రీను నాయక్,హుజూర్నగర్ టౌన్ నాయకులు ముల్కపల్లి రాంబాబు, నేరేడుచర్ల మాజీ మండల అధ్యక్షుడు పంగ శ్రీను, జంపాల వెంకన్న, సర్పంచ్ మచ్చ మురళి,గుగులోత్ హేమ్లా నాయక్ ,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు