జావా యెజ్డి మోటార్‌సైకిల్స్ పై పండుగ ఆఫర్లు

16-10-2026 | 05:00am

ముంబై: ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులు తమకు ఇష్టమైన మోటార్‌సైకిల్‌ను ఇంటికి తెచ్చుకోవటాన్ని సులభం చేస్తూ, జావా యెజ్డీ(Jawa Yezdi) మోటార్‌సైకిల్స్ పలు ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తోంది. ఓనర్­షిప్­ను (స్వామిత్వాన్ని) మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఫైనాన్సింగ్ సొల్యూషన్లను రూపొందించటం జరిగింది. పండుగ ఆఫర్లలో భాగంగా, జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ అనేక రకాల సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ సొల్యూషన్ల ద్వారా, ఎక్కువ మంది రైడర్లు, ఆశించే స్థాయి నుండి స్వంతం చేసుకునే స్థాయికి చేరుకోవటానికి సహాయం చేస్తోంది.

వినియోగదారులు 100% వరకు ఫండింగ్ మరియు జీరో డౌన్ పేమెంట్‌తో ఫైనాన్సింగ్ పరిష్కారాలను పొందవచ్చు. ఇది వారి ఓనర్­షిప్ ప్రస్థానాన్ని ప్రారంభించడానికి అవసరమైన అప్­ఫ్రంట్ కమిట్­మెంటును తగ్గించడంలో సహాయపడుతుంది. 72 నెలల వరకు కాలపరిమితి మరియు 5.99% నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో సహా సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్లు, ఎక్కువ మంది రైడర్లకు ఓనర్­షిప్­ను మరింత సౌకర్యవంతంగా మరియు అందుబాటులో ఉండేలా రూపొందించం జరిగింది.

పండుగ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్‌లో తక్షణ ఆమోద ప్రక్రియలు కూడా ఉంటాయి, ఇవి వేగవంతమైన మరియు మరింత సునాయాసమైన కొనుగోలు అనుభవాన్ని అందిస్తాయి. అర్హులైన కస్టమర్‌లు 'ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి' (బయ్ నౌ పే లేటర్) ఆప్షన్­తో లబ్దిని పొందవచ్చు, ఇది వారికి పండుగ సీజన్‌లో అదనపు సౌలభ్యాన్ని ఇస్తుంది. ఎంపిక చేసిన పథకాలు హైపోథెకేషన్ ప్రయోజనాలను అందించవు, అయితే మహీంద్రా గ్రూప్ ఉద్యోగులు - మరింత సౌలభ్యం కోసం వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రామ్‌ల కింద - ప్రత్యేక ఓనర్­షిప్ లబ్దులను పొందవచ్చు. ఈ సొల్యూషన్లు అన్నీ కలిసి, జావా, యెజ్డీ లేదా BSA మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకోవాలనే తమ ఆకాంక్షను నిజం చేసుకోవడానికి రైడర్‌లకు అనేక మార్గాలను అందిస్తాయి.

క్లాసిక్ లెజెండ్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ థరేజా మాట్లాడుతూ ఇలా అన్నారు, “చాలా మంది రైడర్‌లకు, జావా, యెజ్డీ లేదా BSA వంటి మోటార్‌సైకిల్‌ను స్వంతం చేసుకోవడం అనేది కేవలం ఒక మోటార్‌సైకిల్‌ను ఇంటికి తెచ్చుకోవటం మాత్రమే కాదు, అది ఒక ప్రత్యేకమైన మోటార్‌సైక్లింగ్ సంస్కృతిలో భాగం కావడం లాంటిది. ఈ పండుగ సీజన్‌లో, మేము మరింత సౌలభ్యం మరియు సౌకర్యాన్ని అందించే ఫైనాన్సింగ్ సొల్యూషన్ల ద్వారా ఆ ఆకాంక్షను నెరవేర్చుకోవడాన్ని సులభం చేస్తున్నాము. ఈ ఆఫర్‌లు మొదటి అడుగును సులభం చేయడానికి రూపొందించబడ్డాయి. తద్వారా ప్రామాణికత, వ్యక్తిత్వం మరియు మోటార్‌సైక్లింగ్ ఆనందం చుట్టూ నిర్మించబడిన ఈ కమ్యూనిటీలో ఎక్కువ మంది రైడర్‌లు చేరడానికి వీలు కలుగుతుందన్నారు.

ఈ పండుగ ఆఫర్లతో, జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ వివిధ అవసరాలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిన ఫైనాన్సింగ్ సొల్యూషన్ల సహకారంతో, మరింత మంది రైడర్లు జావా, యెజ్డీ లేదా BSA మోటార్‌సైకిల్‌ను స్వంతం చేసుకునే దిశగా మొదటి అడుగు వేయడాన్ని సులభం చేస్తోంది.

మరిన్ని వార్తలు