మీ వైఫల్యాలను కప్పిపుచ్చలేరు?
సింగరేణి బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహించాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యుత్ రంగ వినాశనానికి, సింగరేణి బొగ్గు కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్(BRS MLC Dasoju Sravan Kumar) డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలు, విద్యుత్ రంగ సంక్షోభం, సింగరేణి బొగ్గు కుంభకోణంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ ఉత్పత్తిని పెంచి కరెంటు కోతలు లేని స్వర్ణయు గాన్ని సృష్టించామన్నారు.
కానీ, నేడు రేవం త్‌రెడ్డి పాల నలో ఆ సంపదంతా సర్వనాశనం అయిపోతోందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్ల ముందు రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే, పరిశ్రమలు జనరేటర్ల మీద నడవాల్సిన దుస్థితి ఏర్పడితే.. అసలు కరెంట్ కోతలే లేవంటూ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కళ్లుండి కూడా కబోదుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ను కేవలం 400 మెగావాట్లకు, 1,200 మెగావాట్ల జైనూర్ ప్లాంట్‌ను 544 మెగావాట్లకు ఎందుకు కుదించారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.