స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశిస్తోన్న మివి
భారతదేశానికి చెందిన వినియోగదారు సాంకేతిక బ్రాండ్ అయిన మివి(Mivi), ఈ రోజు 'మివి ఒన్ 5G'ని విడుదల చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. నమ్మదగిన పనితీరు, ఎక్కువ సేపు పనిచేసే బ్యాటరీ, సులభమైన రోజువారీ వినియోగ అనుభవాన్ని కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించబడిన మివి ఒన్, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫారమ్, 50MP డ్యూయల్-కెమెరా సిస్టమ్, 6000mAh బ్యాటరీ, ప్యూర్ ఆండ్రాయిడ్ అనుభవాల కలయికతో వస్తుంది.
"ప్రెట్టి పవర్ఫుల్ " (చాలా శక్తివంతమైనది) అనే నినాదంతో వస్తున్న మివి ఒన్ , ఆకర్షణీయమైన డిజైన్, నమ్మదగిన పనితీరును ఒకే పరికరంలో అందిస్తుంది. స్ట్రీమింగ్, ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా, గేమింగ్, మల్టీ టాస్కింగ్, రోజువారీ అవసరాల కోసం సమర్థవంతమైన స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే యువత, విలువకు ప్రాధాన్యతనిచ్చే వినియోగదారుల కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది.
మివి ఒన్ 5G భారతదేశం అంతటా ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంటుంది; దీని మొదటి అమ్మకం 8 అక్టోబర్ 2026 అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు ఇలా ఉంటాయి : 4 GB + 128 GB వేరియంట్‌కు రూ. 14,999, 6 GB + 128 GB వేరియంట్‌కు రూ. 15,999 మరియు 8 GB + 128 GB వేరియంట్‌కు రూ. 16,999. అయితే, 'బిగ్ బిలియన్ డే' (బిబిడి) సేల్ సమయంలో మివి ఒన్ 5G ప్రత్యేక ధరలకు లభిస్తుంది: 4+128 వేరియంట్ రూ. 11,999*కి, 6+128 వేరియంట్ రూ.12,999*కి మరియు 8+128 వేరియంట్ రూ.13,999*కి అందుబాటులో ఉంటాయి.
ఈ 'నెట్ ఎఫెక్టివ్ ప్రైస్' (తుది ధర) అనేది ప్లాట్‌ఫారమ్‌పై లభించే ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించబడింది. ఇది బ్లూ, పింక్, గ్రీన్, బర్గండి, నేవీ బ్లూ అనే ఐదు రంగుల ఎంపికలలో లభిస్తుంది. ఈ ఆవిష్కరణ గురించి మివి సహ-వ్యవస్థాపకుడు విశ్వనాథ్ కందుల మాట్లాడుతూ, "స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి ప్రవేశించడం అనేది ఒక స్వదేశీ వినియోగదారు సాంకేతికత బ్రాండ్‌గా మివి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. మివి ఒన్ తో, వినియోగదారుల దైనందిన జీవితంలో కీలకమైన ఈ విభాగంలోకి మేము ఆలోచనాత్మకమైన డిజైన్, నమ్మదగిన సాంకేతికత, నాణ్యతను తీసుకువస్తున్నాము. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా శక్తివంతమైన, అందుబాటు ధరలో ఉండే ఉత్పత్తులను రూపొందించాలనే మా లక్ష్యానికి ఈ స్మార్ట్‌ఫోన్ అద్దం పడుతుంది" అని అన్నారు.