మూడుసార్లు మారథాన్ మెడల్

27-09-2026 | 04:21pm

చందుర్తి,సెప్టెంబర్ 27,(విజయక్రాంతి) : కరీంనగర్(Karimnagar) లో జరిగిన హాఫ్ మారథన్ రన్నింగ్ రేస్(Half marathon running race) లో మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన పాత్రికేయుడు మ్యాకల కొమురయ్య(Journalist Makala Komuraiah) మెడల్ సాధించారు. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైకిలిస్ట్(Runners and Cyclists) ఆధ్వర్యంలో ఐవివై హైస్కూల్(Ivy High School), సిద్దార్థ గ్రూప్ అప్ స్కూల్స్(Siddhartha Group of Schools), తేజస్ డిఫెన్సె అకాడమీ స్పాన్సర్షిప్ లో ఈరోజు కరీంనగర్ లో జరిగిన హాఫ్ మారథన్ ( 21 కి మీ ) రన్ రేస్ లో పాల్గొన్న కొమురయ్య 1 గంట 51 నిమిషాల్లో  21 కిలోమీటర్ల రన్నింగ్ పూర్తి చేసి మెడల్ పొందారు. 

అంతేకాకుండా ఏజ్ గ్రూప్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచ్చినందుకు గాను అవార్డు అందుకున్నారు. కాగా ఆయన మెడల్ పొందడం ఇది మూడో సారి కావడం మరో విశేషం.2024 -25 మరియు 2026 సంవత్సరాల్లొ వరుసగా మెడల్ సాధించారు.కొమురయ్యను మండల ప్రజలు నాయకులు అభినందించారు.

మరిన్ని వార్తలు