కాగ్నిజెంట్, క్లౌడెరాకు షాక్
లేబర్ సర్టిఫికేషన్ నిలిపివేసిన కార్మిక శాఖ
ఈ రెండు సంస్థల ఆర్థిక మోసాలపై ఆరా
వాషింగ్టన్, సెప్టెంబర్ 9: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్(Cognizant), డేటా మేనేజ్మెంట్ క్లౌడెరా(Cloudera)కు అమెరికా షాక్ ఇచ్చింది. వీసా మోసం ఉన్న ఆరోపణల నేపథ్యంలో గ్రీన్‌కార్డుకు అవసరమయ్యే శాశ్వత లేబర్ సర్టిఫికేషన్‌ను అమెరికా కార్మిక శాఖ నిలిపివేసింది. చెన్నైలో స్థాపించబడిన ఈ రెండు కంపెనీల శాశ్వ త కార్మిక ధ్రువీకరణ పత్రాల ఫైలింగ్‌లను నిలిపివేసినట్లు యూఎస్ కార్మిక శాఖ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డీ ఎస్పోసిటో ప్రకటించారు.
దీంతో ఈ రెండు సంస్థలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కాగ్నిజెంట్, క్లౌడెరాలు తీసుకుంటున్న చర్యలతో తమ దేశంలోని ఉద్యోగులకు ముప్పువాటిల్లితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్థలు చేపడుతున్న చర్యలపై వైట్‌హౌ స్లోని టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేపట్టిం దన్నారు. సంస్థలకు సంబంధించిన వాస్తవా లు, ఆర్థిక మోసాలపై ఆరా తీస్తున్నామన్నారు.
క్లౌడెరా పెర్మ్ ఫైలింగ్‌ను కూడా నిలిపి వేశామని ప్రకటించారు. అమెరికా ప్రకటన తో భారత స్టాక్ మార్కెట్లలో ఐటీ సంస్థలకు సంబంధించిన షేర్లు పతనమయ్యాయి. కాగా ఆంథోని ప్రకటనపై కాగ్నిజెంట్, క్లౌడె రాల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడక పోవడం విశేషం. అయితే ఒకరోజు క్రితమే కాగ్నిజెంట్ సంస్థలో ఇంజనీర్, ఫ్రాంటియర్ బిజినెస్ ఆపరేటర్ ఉద్యోగుల సంఖ్యను 15వేలకు విస్తరిస్తామని సంస్థ నిర్వహణాధి కారి రవికుమార్ ప్రకటించారు. ఏఐ వల్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, అమెరికా కార్మికశక్తిలోని ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు అధిక విలువ, వేతనం లభిస్తుందని రవికుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.