వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై కమిషనర్‌కు వినతి

10-09-2026 | 03:32pm

బోధన్ సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ గురు వారం రోజున బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రానున్న వినాయక చవితి ఉత్సవాల(Vinayaka Chavithi Celebrations) సందర్భంగా పట్టణ పరిధిలోని 38 వార్డులలో శానిటేషన్, దెబ్బతిన్న రోడ్ ల మరమ్మత్తు, గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు జరిగినపుడు మంచినీటి వ్యవస్థ, మరియు బోధన్, శక్కర్ నగర్, పసుపు వాగు వద్ద నిమజ్జన సమయంలో ఇబ్బందుల ఎదురుకాకుండా క్రేన్ ల ఏర్పాటు, బైపాస్ ప్రాంతంలో లైట్ల ఏర్పాటు, జూనియర్ కళాశాల వద్ద ఉన్న బావి చుట్టూ ఫెన్సింగ్, జాలి ఏర్పాటు గురించి బోధన్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపికిషన్ మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, సీనియర్ నాయకులు గుంత గంగాధర్, మాజీ కౌన్సిలర్లు గొడుగు ధర్మపురి,మాసిని వినోద్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జాపూర్ అరవింద్, నాయకులు హన్మండ్లు చారి, పెరక వెంకటేష్,  బిజే వైఎం పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్, నాయకులు కలిగోట కృష్ణ,గడ్డం శ్రీనివాస్,  దుర్గా ప్రసాద్, బొడ్డు సురేష్, హరి, రవికుమార్ , అనీల్,పడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు