కదులుతున్న స్లీపర్ బస్సులో మంటలు
కర్ణాటక: శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకాలో కదులుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముంబళు గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై హుటాహుటిన బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సకాలంలో బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా వ్యాపిస్తున్న మంటలను ఫైర్(Fire) సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఘటనాస్థలాన్ని ఇన్ స్పెక్ట్ (Inspect) చేశారు. అయితే బస్సులో మంటలు ఎలా చెలరేగాయి? ప్రమాదానికి గల కారణమేంటనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనపై అధికారులు ఇన్వెస్టిగేషన్(Investigation)చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రోబ్(Probe) చేస్తున్నారు.