పాలు తెచ్చేందుకు వెళ్లి..ప్రాణం బలి

13-10-2026 | 11:10am

చేవెళ్ల, అక్టోబర్ 13 (విజయక్రాంతి): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్తేపూర్‌ గ్రామానికి చెందిన బేగరి రాఘవేందర్‌ (37) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

పాల కోసం వెళ్తుండగా ప్రమాదం పోలీసుల వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం బస్తేపూర్‌ గ్రామానికి చెందిన రాఘవేందర్‌ హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో వంటపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో పాలు తీసుకురావడానికి తన గ్లామర్‌ బైక్‌పై చేవెళ్ల వైపు బయలుదేరాడు. ఇబ్రహీంపల్లి గేట్‌ సమీపంలోని ఓ చాయ్‌ బంక్‌ వద్దకు చేరుకోగానే వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం అతడి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాఘవేందర్‌ తలకు, కుడి చేయి, కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

వాహనదారుడి కోసం పోలీసుల గాలింపు ప్రమాదానికి కారణమైన వాహనదారుడు ఘటనాస్థలం నుంచి పరారైనట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనం, దాని డ్రైవర్‌ వివరాలను గుర్తించే దిశగా చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు