మేయర్ పీఠాలపై వైసీపీ గురి

13-10-2026 | 09:04am

తాడేపల్లి: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (YS Jagan Mohan Reddy) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కో-ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై వైసీపీ (YSR Congress Party) కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితులు, అభ్యర్థుల బలాబలాలపై నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును వైసీపీ ఖరారు చేసింది (Nellore Mayor Candidate). మిగిలిన ప్రాంతాల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై నేటి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు