పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్

13-10-2026 | 11:04am

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): మైనర్ బాలికకు సంబంధించిన ఘటనపై అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న రాయల కోటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 3న క్రైమ్ నంబర్ 150/2026తో భారతీయ న్యాయ సంహిత (BNS)–2023లోని పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం–2012 కింద కేసు నమోదు చేశారు.

భద్రాచలం సబ్‌జైలుకు తరలింపు

కేసు దర్యాప్తులో భాగంగా రాయల కోటయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు మణుగూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో నిందితుడిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించినట్లు అశ్వాపురం ఎస్సై బి. శాంతి తెలిపారు.

మరిన్ని వార్తలు