‘కాకా’ ఆశయాలే స్ఫూర్తి: మేడిపల్లి సత్యం

05-10-2026 | 03:36pm

దళితుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత కాకా వెంకటస్వామి

కరీంనగర్,(విజయక్రాంతి): నేడు కరీంనగర్(Karimnagar) డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ, మాజీ సి డబ్ల్యూసీ మెంబర్, దళిత ఉద్యమ నేత స్వర్గీయ గడ్డం వెంకటస్వామి(Gaddam Venkataswamy) జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం(Medipally Sathyam) ముఖ్య అతిథిగా విచ్చేసి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం  కలిసి వెంకటస్వామి  చిత్రపటానికి పూలమాల సమర్పించి, పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడిపల్లి సత్యం  మాట్లాడుతూ.. దివంగత నాయకులు వెంకటస్వామి  అభిమానులందరూ 'కాకా' అని పిలుచుకునే వెంకటస్వామి  జయంతి సందర్భంగా, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, జిల్లా ప్రజల తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్(Congress) అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం అన్నారు.

వెంకటస్వామి ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి, పార్లమెంటరీ వ్యవస్థలో ఢిల్లీ రాజకీయాలను శాసించిన గొప్ప నాయకుడని కొనియాడారు. పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, డబ్ల్యూసీ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా, పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించారని తెలిపారు.

1960, 70ల దశకంలో హైదరాబాద్‌లోని పారిశ్రామిక ప్రాంతాల్లో పేదలకు, ఇల్లు లేని వారికి గుడిసెలు వేయించి 'గుడిసెల వెంకటస్వామి'గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్(Dr. Babasaheb Ambedkar) స్ఫూర్తితో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించి, బాగ్ లింగంపల్లిలో కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థలు స్థాపించి వేల మందికి విద్యాబుద్ధులు నేర్పించారని, అక్కడ చదువుకున్న నేడు IAS, IPSలుగా, రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారని అన్నారు.

వెంకటస్వామి  జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, వారు క్రమశిక్షణ, పట్టుదలతో ఎదిగిన తీరును ప్రతి కాంగ్రెస్ కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి అడుగుజాడల్లోనే వివేక్ వెంకటస్వామి  వినోద్  వంశీకృష్ణ  ప్రజలకు అద్భుతంగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో  కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల  అంజన్ కుమార్, కర్ర సత్య  ప్రసన్నారెడ్డి,ఆకారపు భాస్కర్ రెడ్డి,బానోతు శ్రావణ్ నాయక్, కల్వల  రాంచందర్, వరాల నర్సింగం,  శుకూర్, సరిల్ల రతన్ రాజు, విక్టర్,కొలగాని అనిల్,  అనంతుల రమేష్, మాదాసు శ్రీనివాస్, కుర్ర పోచయ్య, మాలోతు  మహాలక్ష్మి, జొన్నల రమేష్, చింతల కిషన్, మూల జైపాల్, స్వప్నశ్రీ, శిల్ప, రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రంగనాయక, వీర దేవేందర్, పెంట శేఖర్, అందే శంకర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు