టెక్బాల్ సెమీస్‌లో ఓడిన క్విన్సీ డిసౌజా
ఆసియా క్రీడలు 2026: నాగోయాలో ఆసియా క్రీడలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆసియా క్రీడలు 2026లో భాగంగా టెక్బాల్లో తొలిసారిగా అడుగుపెట్టిన భారత క్రీడాకారిణి క్విమ్సీ జోక్విమ్ డిసౌజా(Quimcy Dsouza loses) శనివారం నగోయా సిటీ హిగాషి స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన సెమీ-ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ఇమా సుమయా చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. ఆమె ఇప్పుడు ఆదివారం జరిగే కాంస్య పతకం మ్యాచ్‌లో పోటీపడుతుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, ఆసియా క్రీడల్లో భారత్ మొట్టమొదటి టెక్బాల్ పతకాన్ని కైవసం చేసుకుంటుంది.
కాంస్య పతకం కోసం పోరు
టెక్బాల్ మహిళల సింగిల్స్ విభాగం సెమీ-ఫైనల్లో క్విన్సీ డిసౌజా అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించినప్పటికీ, విజయం సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. ఆదివారం ఉదయం జరగనున్న కాంస్య పతక పోరుకు సిద్ధమవుతుంది. కాంస్య పతకం కోసం జరిగే పోరులో క్విన్సీ, జపాన్‌కు చెందిన యుయినా సకమోటోతో తలపడనుంది.