కేటీఆర్ తో నిర్మల్ బీఆర్ఎస్ నేతల సమావేశం
27-10-2026 | 06:44pm
నిర్మల్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేయాలని ఆ పార్టీ కార్యనిర్వక అధ్యక్షులు కేటీఆర్(BRS working president KTR) సూచించినట్టు జిల్లా పార్టీ నేతలు తెలిపారు. హైదరాబాదులో మంగళవారం నిర్మల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ నేతలు రామ్ కిషన్ రెడ్డి, మార్గుండా రాము, డాక్టర్ సుభాష్ రావు, లోలం శ్యాంసుందర్, కిరణ్ కారే, నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలతో కలిసి పోరాడాలని సూచించినట్టు తెలిపారు. ఈనెల 1న అదిలాబాదులో నిర్వహించి కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించినట్టు తెలిపారు.