హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలి
డాక్టర్ కడియం కావ్య
వరంగల్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య(Kadiyam Kavya) పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ డైరెక్టర్ (హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) భూపేంద్ర భాస్కర్(Bhupendra Bhaskar) శనివారం ఎంపీ కడియం కావ్య కు అధికారిక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజారోగ్యం, వ్యాధుల నివారణ, క్యాన్సర్ స్క్రీనింగ్, ఆధునిక వైద్య సాంకేతికత, వైద్యసేవల అందుబాటు, ఆరోగ్య మౌలిక వసతుల బలోపేతం వంటి అంశాలలో కమిటీ ద్వారా జాతీయస్థాయిలో మరింత బలంగా ప్రస్తావించేందుకు కృషి చేస్తానని తెలిపారు.