ఎదురెదురుగా దూసుకొచ్చిన బైకులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

02-11-2026 | 12:05pm

రామగిరి, నవంబర్ 2 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటీనరీ కాలనీలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.

బేగంపేటకు చెందిన తండ్రీకొడుకులు తూర్పాటి సమ్మయ్య (70), సాయిలు (45) ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మంథని మండలం పుట్టపాకకు చెందిన సిరిసెట్టి అశోక్ బైక్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సమ్మయ్య, సాయిలుకు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక సహాయం (First Aid) అందించారు. అనంతరం 108 అంబులెన్స్ (Ambulance)లో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ (Investigation) చేపట్టారు.

మరిన్ని వార్తలు