సేంద్రియ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించాలి

16-10-2026 | 10:25pm

హనుమకొండ, అక్టోబర్ 15(విజయక్రాంతి): సేంద్రీయ వ్యవసాయాన్ని(Organic farming) ప్రోత్సహించి, క‌లుషితం లేని ఆహారం(Uncontaminated food) ప్ర‌జ‌లంద‌రికీ అందించాలని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్ర‌పంచ ఆహార దినోత్స‌వం సంద‌ర్భంగా ఎంఏజేఏఆర్‌సీ ఏషియా సంస్థ(MAJARC Asia Organization) అధ్య‌క్షులు కుమ్మ‌రి క్రిష్ణాక‌ర్ ఆధ్వర్యంలో శుక్ర‌వారం రోజున సోమిడిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై మ‌హిళా రైతు పాల‌డుగుల స‌రోజ‌న కు ఉత్త‌మ రైతు అవార్డు అంద‌జేసి, శాలువాతో స‌త్క‌రించారు. అనంతరం ప్లాస్టిక్ కు వ్య‌తిరేకంగా కేవ‌లం ఆకులతో త‌యారు చేసే విస్తారాకుల‌ త‌యారీ యంత్రాన్ని ఈ సంద‌ర్భంగా ప్రారంభించారు.

అనంత‌రం దాస్యం విన‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ వ్య‌వ‌సాయంలో ర‌సాయ‌నాల వాడ‌కాన్ని త‌గ్గించి, సేంద్రియ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించాలని పిలుపునిచ్చారు. నేటి స‌మాజంలో ప్ర‌జ‌ల‌కు క‌లుషుత‌మైన ఆహారం, ఆహార ప‌దార్థాలు ల‌భిస్తున్నాయ‌ని, వాటి కార‌ణంగా ప్ర‌జ‌లు రోగాల బారిన ప‌డుతున్నార‌ని, నాణ‌మైన, కాలుష్య‌ర‌హిత‌మైన, ర‌సాయ‌నాలు వినియోగించ‌ని ఆహార ప‌దార్థాలు అందే విధంగా వ్య‌వ‌సాయం, రైతులు, ప్ర‌భుత్వాలు చొర‌వ చూపాల‌ని అన్నారు.

మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణిస్తున్నార‌ని, వ్య‌వ‌సాయ రంగంలో పురుషుల‌కు స‌మానంగా మ‌హిళ‌లు ప‌నులు చేస్తున్నార‌ని, ఎన్నో ఎళ్లుగా వ్య‌వ‌సాయం చేస్తున్న స‌రోజ‌న గారే అందుకు నిద‌ర్శ‌నం అన్నారు.ఎంఏజేఏఆర్‌సీ ఏషియా సంస్థ త‌ర‌పున అనేక‌ సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న క్రిష్ణాక‌ర్ సేవ‌లు ఆద‌ర్శ‌నీయం అని కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ పార్టీ  రాష్ట్ర నాయ‌కులు నార్ల‌గిరి ర‌మేష్‌, డివిజ‌న్ అధ్య‌క్షులు పాల‌డుగుల శివ‌కుమార్‌, సీనియ‌ర్ నాయ‌కులు సుంచు కృష్ణ‌, కాటాపూర్ రాజు, కుమ్మ‌రి రాజేంద‌ర్‌, సుంచు ర‌ఘురాం, మ‌ల్లేష్‌, బ‌స్వ యాద‌గిరి, సుంచు అశోక్‌, రాజ్‌కుమార్‌, ప్ర‌భాక‌ర్‌, శ్రీ‌నివాస్‌, విల్స‌న్‌, చార్లెస్‌, అనిత‌, ఫ్రెండ్స్ యూత్ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు