బతుకమ్మ సంబరాల్లో పోలీస్ బాస్
- పోలీస్ సిబ్బందితో బతుకమ్మ సంబరాలు
- ఉత్సాహంగా పాల్గొన్న ఎస్పీ, పోలీస్ అధికారులు
ములుగు, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : బతుకమ్మ సంబరాల్లో(Bathukamma celebrations) పాల్గొని సహజర సిబ్బంది అధికారులు జిల్లా పోలీస్ బాస్(District Police Chief) ఉత్సాహాన్ని నింపారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్(District SP Sudheer Ramnath Kekan) ఆదేశాల మేరకు ములుగు జిల్లా మహిళా అధికారులు, సిబ్బంది(Female officials and staff of Mulugu district) కోసం బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ బతుకమ్మ సంబరాలలో జిల్లా ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి పాల్గొని అందర్నీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, ఏటూరు నాగారం ఏఎస్పీ మనన్ భట్, డిసిఆర్బి డిఎస్పి కిషోర్ కుమార్, ములుగు డిఎస్పి రవీందర్, ఇన్స్పెక్టర్లు, రిసర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.